బి.జె.పి మంత్రి రాజీనామా !

భారతీయ జనతా పార్టీ నుంచి ప్రముఖ నేతలు ఒక్కోక్కరూ గా బైటికి వెళ్లి పోతున్నారు. ఉత్తర భారతంలో రానున్న కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీలోను, ప్రభుత్వంలోనూ పదవులు అనుభవిస్తున్న నేతలు బి.జె.పి ని వీడుతున్నారు. పశ్చమ బంగాల్ లో బాబులాల్ సుప్రియో తో ఆరంభమైన వలసలు తాజాగా ఉత్తర ఖండ్ నూ తాకాయి. ఆ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉంది. అక్కడి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రి గా ఉన్నయశ్ పాల్ ఆర్య, అతని కుమారుడు సంజీవ్ కమలదళానికి రాజీనామా చేశారు. కొద్ది సేపటి క్రితం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కొద్ది నెలల్లో ఉత్తర ఖండ్ శాసన సభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యశ్ పాల్ ఆర్య తన సహచరులతో పార్టీని వీడడం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. 2007 నుంచి 2014 వరకూ యశ్ పాల్ ఆర్య ఉత్తర ఖండ్ కాంగ్రెస్ కమిటీ కి అధ్యక్షుడిగా వ్యవహరించారు. రావత్ మంత్రి వర్గంలో శాసన సభ స్పీకర్ గా , తదుపరి మంత్రిగా వ్యవహరించారు. కాంగ్రెస్ అసంతృప్తిని వెళ్లగక్కి 2017 ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలోచేరారు. ప్రస్తుం అధికారంలో ఉన్న బి.జె.పిలో రవాణా శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఈ ఉదయం తన అనుచరులతో ఢిల్లీకి వచ్చిన ఆయన రాహుల్ గాంధీతో సమావేశ మయ్యారు. మద్యాహ్నం సీనియర్ కాంగ్రెస్ నేతలు వేణుగోపాల్ తదితరలు సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. యశ్ పాల్ ఆర్య బి.జె.పి ని వీడనున్నట్లు, కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఎవ్వరికీ ఎలాంటి సమాచారం లేక పోవడం విశేషం. యశ్ పాల్ ఆర్య తాజా చర్యతో భారతీయ జనతా పార్టీ నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp