అదానీ గ్రూప్ భార‌త‌దేశంలో ప‌లు పోర్టుల‌ను నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక‌నుంచి త‌మ పోర్టుల్లో పాకిస్తాన్‌, ఆఫ్గ‌నిస్తాన్‌, ఇరాన్ దేశాల నుంచి వ‌చ్చే స‌ర‌కు కంటెయిన‌ర్ల‌ను త‌మ పోర్టుల్లో నిలిపేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. న‌వంబ‌రు 15వ తేదీ నుంచి ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి రానున్న‌ట్లు అదానీగ్రూప్ ప్ర‌క‌టించింది. ఇరాన్‌లోని బంద‌ర్ అబ్బాస్ పోర్టుమీద‌గా గుజ‌రాత్‌లోని ముంద్రా ఎయిర్‌పోర్టుకు సెప్టెంబ‌రులో చేరుకున్న ఒక కంటెయిన‌ర్ల‌లో భారీ విలువ క‌లిగిన హెరాయిన్‌ను ప‌ట్టుకున్న సంగతి తెలిసిందే. దీనిపై దేశ‌వ్యాప్తంగా అదానీ గ్రూప్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్త‌డంతో సంస్థ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ప‌ట్టుబ‌డిన హెరాయిన్ కేసులో ఏపీకి చెందిన వ్య‌క్తి ప్ర‌మేయం కూడా ఉన్న‌ట్లు వార్త‌లు రావడం సంచ‌ల‌నం క‌లిగించింది. ఏపీ సెజ్ పోర్టుల్లో థ‌ర్డ్ పార్టీ నిర్వ‌హించే పోర్టుల్లో, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ నిర్వ‌హించే అన్ని టెర్మిన‌ల్స్ కు తాము తీసుకున్న నిర్ణ‌యాన్ని వ‌ర్తింప చేయ‌నున్నట్లు అదానీ పోర్ట్స్ ప్ర‌క‌టించింది. ప‌ట్టుబ‌డిన హెరాయిన్ మూడువేల కిలోలు ఉంటుంద‌ని డీఆర్ ఐ అధికారులు ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: