మా సభ్యులు ఓటు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదములు తెలిపారు మంచు విష్ణు. త‌మ ప్యానెల్ స‌భ్యులు ఎంతో కష్టపడి పని చేశారని చెప్పారు. అవతలి ప్యానెల్ వారు కూడా మా సభ్యులే అంటూ విష్ణు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. నాగబాబు కూడా మా కుటుంబ సభ్యులేన‌ని..అయన రాజీనామాను నేను ఎక్స్ప్ట్ చేయ‌లేద‌ని చెప్పారు. త్వరలోనే నాగబాబును కలుస్తానని మంచు విష్ణు స్ప‌ష్టం చేశారు. జరిగింది జరిగిపోయిందని...జరగాల్సింది చెయ్యాలంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ప్రకాష్ రాజ్ రాజీనామాను కూడా తాను అంగీకరించనని...ప్రకాష్ రాజ్ సలహాలు సూచనలు కావాలని మంచు విష్ణు అన్నారు.

రెండు మూడు రోజుల్లో ప్రకాష్ రాజ్ ను కూడా కలుస్తానని మంచు విష్ణు వెల్ల‌డించారు. శ్రీలంక ఆప్ఘనిస్తాన్ ల‌ నుంచి కూడా నటులు తెలుగు కి రావాలని..260 మంది సభ్యులు ప్రకాష్ రాజ్ ను కోరుకున్నారని అయన మా కు కావాలని మంచు విష్ణు కామెంట్ చేశారు. అంతే కాకుండా రామ్ చరణ్ నాకు మంచి మిత్రుడని అతను ఓటు ప్రకాష్ రాజ్ కే వేసి వుంటారంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. చరణ్ వాళ్ల నాన్న చిరంజీవి మాట జమ దాటడు అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న‌ను చిరు పోటీలో నుండి త‌ప్పుకోవాల‌ని అన్నారంటూ మంచు విష్ణు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: