టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు కాసేపటి క్రితం గుండెపోటుతో మరణించారు. జూనియర్ ఎన్టీఆర్ సహా పలువురు హీరోలతో అత్యంత సన్నిహితంగా ఉండే మహేష్ కోనేరు మరణం తో ఒక్కసారిగా టాలీవుడ్ దిగ్భ్రాంతికి లోనైంది. జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా కూడా మహేష్ కోనేరు ను చెప్తూ ఉంటారు. కళ్యాణ్ రామ్  అలాగే సత్యదేవ్  తో కలిసి పలు చిత్రాలను మహేష్ కోనేరు నిర్మించారు.

 118, తిమ్మరసు వంటి చిత్రాలను మహేష్ కోనేరు నిర్మించారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పి ఆర్ ఓ గా ఆయన పని చేశారు. అలాగే మహేష్ బాబు తో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉంది. సినిమాలకు సంబంధించిన ప్రకటనలు మహేష్ కోనేరు చేస్తే వాటికి సోషల్ మీడియాలో మంచి ఆదరణ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: