విద్యత్ సంక్షోభం :  రంగంలోకి దిగిన పి.ఎం.వో

భారత దేశంలో బొగ్గు నిల్వలు అడుగంటుతున్న నేపథ్యంలో, పరిస్థితిని స్వయంగా అంచనా వేసేందుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కార్యాలయం (పి.ఎం.వో) మంగళవారం నేరుగా రంగంలోకి దిగింది.  దేశంలోని గనుల్లో ఉన్న బొగ్గు నిల్వలు, ధర్మల్ కేంద్రాల వద్ద ఉన్న నిల్వలు, ప్రస్తుతం జరుగుతున్న విద్యత్ ఉత్పత్తి, వివిధ రాష్ట్రాల వినియోగం, పారిశ్రామిక  అవసరాలకు  వినియోగిస్తున్న విద్యుత్ ఎంత ? వ్యవసాయానికి వినియోగిస్తున్న విద్యుత్ ఎంత ? గృహావసరాల కు వినియోగిస్తున్న విద్యత్ ఎంత ? తదితర అంశాలపై చర్చించేందుకు ప్రధాన మంత్రి కార్యాలయం పూనుకుంది. ఆయా శాఖల అధికారులతో చర్చిస్తోంది.
దేశంలో విద్యుత్ సంక్షోభం ఏర్పడనుందని పలు రాష్ట్రాలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సోమవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన మంత్రి వర్గ సహచరులైన  బొగ్గ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి,  విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె. జోషిలతో సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా పలు అంశాలను చర్చించారు. బొగ్గు నిల్వలు సరిపడినంత లేని ధర్మల్ విద్యుత్ కేంద్రాల సంఖ్య 70కిపైగా పెరిగినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా   జరిపిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే  ఆ సమావేశం తరువాత  హోం మంత్రి, కేంద్ర న్యాయ శాఖ మంత్రితోనూ సమావేశమయ్యారు. ఈ సమావేశం వివరాలు వెలుపలికి తెలియరా లేదు. తాజాగా మంగళవారం పి.ఎం.వో ఏర్పాటు చేసిన సమావేశం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.  దేశం లో ఏర్పడిన  బొగ్గు డిమాండ్  విజయ దశమి తరవాత కొంత తీరవచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి.  దుర్గా నవరాత్రులు పూర్తయిన తరువాత 1.5 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: