మా ఎన్నికలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలవడాన్ని మెగా కుటుంబం జీర్ణించుకోలేదు అనే విషయం క్లియర్ గా అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా పోటీ చేసిన సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్... రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటుగా గెలిచిన 11 మంది సభ్యులు కూడా నేడు రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన విమర్శలు చేశారు. సీనియర్ నటుడు బెనర్జీ మాట్లాడుతూ... మోహన్ బాబు నన్ను బూతులు తిట్టాడు..కొట్టడానికి వచ్చాడు అంటూ విమర్శలు చేశారు. అదే విధంగా అందరి ముందు నన్ను బూతులు తిడుతూ ఉంటే నేను ఎందుకు ఉండాలి అని  ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల నుండి చాలా బాధ కలుగుతుంది అని మీడియాతో మాట్లాడుతూ భోరున ఏడ్చేశారు బెనర్జీ.

మరింత సమాచారం తెలుసుకోండి: