వార్డ్ మెంబెర్ గా పోటీచేసిన బీజేపీ అభ్యర్థి కి కేవలం ఒక్క ఓటు పోల్ అవ్వడం తో  సోషల్ మీడియాలో ఈ వార్త తెగ  వైరల్ అవుతోంది. అక్టోబర్ 6 , 9 వతేదీల్లో చెన్నైలోని స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కోయంబత్తూరు లోని పెరియానాయికెన్‌పాలయం యూనియన్‌ లో వార్డు మెంబర్‌గా పోటీచేసిన డి.కార్తీక్ అనే బీజేపీ అభ్యర్థి  పోటీచేయగా కేవలం ఒకే ఒక ఓటు పొందగలిగాడు. ఇందులో విశేషం ఏమిటంటే అతని ఇంట్లో  ఐదుగురు ఓటర్లు  ఉండగా .. వార్డ్ ఎలక్షన్స్ లో ఆ అభ్యర్థికి ఒకే ఒక ఓటు లభించింది. దింతో డి.కార్తిక్ ఓటమి పాలు అయ్యాడు. 



ఈ ఘటనతో ఇతర పార్టీలు బీజేపీ పై కామెంట్స్  చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట #Single_Vote_BJP  ట్యాగ్ లైన్ తో   వైరల్ అవుతోంది. రైటర్ మరియు కార్యకర్త అయినటువంటి  మీనా కందసామి  ట్యాగ్ చేస్తూ " తమిళ్ నాడు స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి  డీ.కార్తీక్ కి కేవలం ఒకే ఓటు వచ్చింది. ఇతరులకు ఓటు వేయాలని నిర్ణయించుకున్న మిగతా నలుగురు ఓటర్లను చుస్తే గర్వాంగా ఉంది". అంటూ సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. ఈ సీన్ తో బీజేపీ కి తమిళ్ నాడులో నూకలు చెల్లాయని  ఇతర పార్టీలవారు కామెంట్స్ చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP