జపాన్ ప్రధాని అనూహ్య నిర్ణయం

జపాన్ నూతన ప్రధాన మంత్రిగా పది రోజల క్రితం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఫ్యూమియో కిషిడా  ఆ దేశ దిగువ సభను రద్దు చేస్తున్నట్లు  ప్రకటించారు. ఇతని తాజా నిర్ణయం పై ప్రపంచ దేశాలు నివ్వెర పోయాయి. జపాన్ ప్రధాన మంత్రి మాత్రం తనను తాను సమర్థించుకున్నారు. జాతీయ ఎన్నికలను నిర్వహించి ప్రజామోదం తిరిగి పొందుతానని ప్రకటించారు.  విశేషాధికారాలున్న ప్లీనరీ సమైవేశంలో   స్పీకర్  డోమో ఓషియో ఈ విషయాని ధృవీకరించారు.  స్పీకర్ ప్రకటన చేసిన సమయంలో సభకు హజరైన దిగువ సభ లోని 465 మంది సభ్యులు లేచి నలబడి బల్లలు  చరిచి తమ అంగీకారం తెలిపారు. ప్రధాని నిర్ణయంతో వీరందరూ  తక్షణం తమ అధికారాలను కోల్పోయారు.
2017లో చివరి సాగి జపాన్ దిగువ సభకు ఎన్నికలు జరిగాయి.  అప్పడు ప్రధాన మంత్రిగా  షిబ్డ్క్ అబే ఎంపికయ్యారు. ఆ  తరువాత యోషిహైజ్ సుగా  ప్రధాని పదవిని చేపట్టారు. ఒలింపిక్ క్రీడల నిర్వహణలో ఆయన చాలా విమర్శలను ఎదుర్కోన్నారు.కేవలం పది రోజల క్రితం కిషిడా ప్రధాని అయ్యారు. తాను ప్రధాని పదవి చేపట్టి న వెంటనే చైనా , ఉత్తర కొరియా నుంచి దేశాన్ని రక్షిస్తానని వాగ్దానం చేశారు. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: