ఆఫ్ఘనిస్తాన్ ప్రజలను ముష్కరులు నీడలా వెంటాడుతున్నారు. ప్రతినిత్యం బాంబులతో ప్రాణాలను హరిస్తున్నారు. తాలిబన్లు పాలన చేపట్టిన తరువాత అక్కడ యుద్ధ వాతావరణం చోటుచేస్తుకుంది. ఇప్పటికే పలుమార్లు ప్రార్థన మందిరాలను టార్గెట్ చేసి బాంబులతో దాడులు జరుపుతున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్లో లోని సౌత్ ప్రావిన్స్‌లోని కాందహార్ లోని ఇమామ్ బార్గా మసీదు లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ దుర్ఘటనలో 16 మంది అక్కడికక్కడే మరణించారు. దాదాపు 32  మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన హాస్పిటళ్ళకు తరలిస్తున్నారు. 



అయితే ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇంకా పూర్తి  సమాచారం అందవలసి ఉంది. శుక్రవారం ప్రార్థన కోసం మసీదులు భక్తులతో కిక్కిరిసి ఉంది .ఈ నేపథ్యంలోనే ముష్కరులు బాంబులతో దాడిచేశారు. అయితే ఈ ఘటన గురించి ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు భాద్యత వహించలేదు. గత శుక్రవారం నాడు ఆఫ్ఘనిస్తాన్ లో ని కుందుజ్ ప్రావీన్స్ లో ఇదే రకమైన బాంబు పేలుళ్లు సంభవించాయి . ఈ దుర్ఘటనలో 60 మంది భక్త జనం చనిపోగా , వందల మంది గాయాల పాలయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల హస్తగతం ఐనప్పటినుండి అప్ఘన్ లో నిత్యం బాంబు దాడులు జరుగుతున్నాయి. అయితే ఉగ్రవాద సంస్థ అయినటువంటి ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు ఈ దురాగతానికి కారణమై ఉండవచ్చని అనుకుంటున్నారు .  


మరింత సమాచారం తెలుసుకోండి: