పార్లమెంట్ సభ్యుడినే పోడిచి పొడిచి చంపారు
 
ఆయనో పార్లమెంట్ సభ్యుడు. ప్రజలతో సమావేశమై ఉండగా  దుండగుడు హటాత్తుగా ఆయన పై దూకి కత్తితో పోడిచి, పోడిచి చంపారు.   ప్రజా ప్రతినిధులకే రక్షణ  లేక పోతే సామాన్యులకు ఏం భద్రత ఉంటుందని అక్కడి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ ప్రాంతంలోనూ 2016 లోనూ, 2010 లోనూ ప్రజా ప్రతినిధులపై దాడులు జరిగాయి.
బ్రిటన్  పార్లమెంట్ సభ్యుడు  డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు. దుండగుడు అతనిని కత్తితో పొడిచి , పొడిచి దారుణంగా హతమార్చారు. ఈ ఘటనలో అమీస్ తో పాటు మరి కొద్ది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సెక్స్  సమీపంలో సౌత్ ఎండ్ వెస్ట్ ప్రాంతం నుంచి  డేవిడ్ అమీస్ పార్లమెంట్ కు  ప్రాతినిధ్యం  వహిస్తున్నారు. ఈయన కన్జర్వేటివ్ పార్టీ  ప్రతినిధి. దాడి జరిగిన వెంటనే అక్కడ ఉన్న వారు  పార్లమెంట్ సభ్యుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు  వైద్యులు ప్రకటించారు.
1983 నుంచి డేవిడ్ అమీస్ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఈయనకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. పోరాట యోధుడిగా కూడా అక్కడి వారి ఈయనను అభివర్ణిస్తుంటారు. బ్రిటన్ లో మహిళల గర్బస్రావాలకు వ్యతిరేకంగా ఈయన చేసిన పోరాటాన్ని అక్కడి ప్రజలు నిత్యం చర్చించుకుంటుంటారు. అదే సమయంలో ఆయన  మూగ జీవాలపై కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు. దీంతో ఆయనకు దేశ వ్యాప్తంగా మంచి  ఫాలోయింగ్ ఉంది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు డేవిడ్ అమీస్ అత్యంత సన్నిహితుడు. ఇద్దరూ   కన్జర్వేటివ్ పార్టీ  ప్రతినిధులే. లండన్ కు నలబై కిలోమీటర్ల దూరంలో  థేమ్స్ నదీ తీరంలో ఉన్న లేహ్ ఆన్ సీ  పట్టణంలో ఈ దారుణం జరిగింది.  డేవిడ్ అమీస్ చర్చిలో తన సన్నిహితులతో సమావేశమై ఉండగా  ఈ ఘటన జరిగింది.  సమాచారం అందుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. డేవిడ్ అమీస్ మృత దేహం ఉన్న ఆసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు.
ఈ ఘటన తనను దిగ్బ్రాంతికి గురి చేసిందని కామన్స్ సభ స్పీకర్ లిడ్సే హుయలీ పేర్కోన్నారు. డేవిడ్ అమీస్ హత్యను లేబర్ పార్టీ నేతలు కూడా ఖండిచారు. ఈ ఘటన దారుణమైనదని ప్రతితపక్షనేత స్మార్టర్ వ్యాఖ్యానించారు. నిందితుడ్ని తాము అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: