ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌ను పుర‌స్క‌రించుకొని ఇంద్రకీలాద్రిపై అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు అభ‌య‌మిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా త‌ర‌లివ‌స్తుండ‌టంతో కొండ‌పై తాకిడి పెరుగుతోంది. సాధార‌ణ భ‌క్తుల‌తోపాటు భ‌వానీ భ‌క్తులు కూడా వ‌స్తుండ‌టంతో ర‌ద్దీని నియంత్రించ‌డానికి అధికారులు చ‌ర్య‌లు చేప‌ట్టారు. శ‌ని, ఆదివారాల్లో వీఐపీ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దుచేశారు. ప్రొటోకాల్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్దుచేస్తున్న‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు. కొండ‌పైకి వాహ‌నాల‌కు కూడా అనుమ‌తివ్వ‌డంలేదు. శ‌ర‌న్న‌వ‌రాత్రులు ముగియ‌డంతో భ‌వానీ మాల వేసుకున్న భ‌క్త‌లు దీక్ష‌ను వ‌దిలిపెట్ట‌డానికి భారీ సంఖ్య‌లో కొండ‌కు చేరుకుంటున్నారు. అలాగే వ‌రుస‌గా రెండురోజులు సెల‌వుదినాలు కావ‌డంతో సాధార‌ణ భ‌క్తుల ర‌ద్దీ కూడా పెరిగింది. పండ‌గ స‌మ‌యంలో ద‌ర్శించుకోనివారంతా ఇప్పుడు వ‌స్తుండ‌టంతో ఒక్క‌సారిగా ఇంద్రీక‌లాద్రిపై ర‌ద్దీ పెరిగింది. కొవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ అమ్మ‌వారిని ద‌ర్శించుకోవాల‌ని, మాస్క్ లేకుంటే ద‌ర్శ‌నానికి అనుమ‌తించేది లేద‌ని అదికారులు స్ప‌ష్టం చేస్తున్నారు.  కొవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటించేలా చూడ‌టం కోసం కొండ‌పై సిబ్బంది ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్షణ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa