ఎట్ట‌కేల‌కు మా నూత‌న కార్య‌వ‌ర్గం కొలువుదీరింది. మా నూత‌న అధ్య‌క్షుడిగా మంచు విష్ణు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ప్ర‌మాణ‌స్వీకారంలో విష్ణుతోపాటు ఆయ‌న ప్యానెల్ నుంచి గెలుపొందిన 15 మందిచేత ఎన్నిక‌ల అధికారి కృష్ణ‌మోహ‌న్ ప్ర‌మాణం చేయించారు. ప్ర‌మాణ‌స్వీకారానికి ముందు విష్ణు త‌న కార్య‌వ‌ర్గ స‌భ్యుల‌తో క‌లిసి పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఆయ‌న‌తోపాటు పూజ‌లో మాజీ అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేష్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రై విష్ణుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సైతం పాల్గొని నూత‌న కార్య‌వ‌ర్గానికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. మ‌రోవైపు ప్ర‌కాష్ రాజ్ ప్యానెల్ త‌ర‌ఫున గెలుపొందిన 11 మంది హాజ‌రుకాలేదు. వారు ఇప్ప‌టికే క‌లిసి ప‌నిచేయ‌లేమంటూ రాజీనామాలు స‌మ‌ర్పించారు. అత‌ని ప్యానెల్ స‌భ్యులెవ‌రూ ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు. విష్ణు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు కాబ‌ట్టి ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకుంటుందో వేచిచూడాలి మ‌రి.!!


మరింత సమాచారం తెలుసుకోండి:

maa