వైఎస్ జగన్ పాలనపై సొంత జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి మండిప‌డ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన డీఎల్ జగన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని వ్యాఖ్యానించారు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి పాలన చూడలేద‌ని, మంత్రులు, ఎమ్మెల్యేలే ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములను లాక్కుంటుంటే ప్ర‌జ‌ల‌కు ఎక్క‌డ న్యాయం జ‌రుగుతుంద‌న్నారు. రెవెన్యూ, పోలీస్‌ శాఖలు వారిచేతుల్లో కీలుబొమ్మలుగా మారాయని, ఆయా శాఖల సమస్యల పరిష్కార వివరాలు మంత్రులు చెప్పాలికానీ పెత్తనం చేయడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవ‌రంటూ ధ్వ‌జ‌మెత్తారు. ప్రభుత్వాన్ని సజ్జలే నడిపిస్తే మంత్రులెందుకు, అధికారులెందుకు అని ప్ర‌శ్నించారు. రాష్ట్రంలో అసలేం జరుగుతోంది..? కింది స్థాయిలో ఏం జరుగుతోంది..? అనే విషయాలు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తెలుసుకోవాల‌ని సూచించారు. సూటిగా, స్ప‌ష్టంగా మాట్లాడే త‌న‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించే ధైర్యం ఎవ‌రూ చేయ‌ర‌ని డీఎల్ ర‌వీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: