మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆయ‌న‌తోపాటు గెలుపొందిన ప్యానెల్ స‌భ్యులు కూడా ప్ర‌మాణం చేశారు. తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌కాష్ రాజ్‌కు మొద‌టినుంచి తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌ల‌తో స‌త్సంబంధాలున్నాయి. భార‌తీయ జ‌న‌తాపార్టీపై వ్య‌తిరేకంగా పోరాడ‌టంతోపాటు కేటీఆర్తోపాటు త‌ల‌సాని, ఇత‌ర మంత్రులు, నేత‌ల‌కు ప్ర‌కాష్ రాజ్ అంటే మంచి అభిమానం. కానీ మా అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు వ‌చ్చేస‌రికి ఆ అభిమానం ప‌నిచేయ‌లేదు. ఇక్క‌డే టీఆర్ ఎస్ రాజ‌కీయం అర్థ‌మైంది. ప్ర‌కాష్ రాజ్ ఓట‌మిపాల‌య్యారు. మంచు విష్ణు గెలుపొందారు. ఒక‌ర‌కంగా తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌కాష్ రాజ్‌కు హ్యాండిచ్చింద‌నే ప్ర‌చారం న‌డిచింది. వారు క‌నుక దీన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ప‌నిచేసివుంటే ప్ర‌కాష్ రాజ్ గెలిచివుండేవాడ‌ని, కానీ ఇక్క‌డే ఆ పార్టీ రాజ‌కీయం అర్థం చేసుకోవ‌చ్చంటున్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఎంత వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా ఢిల్లీకి వెళ్లేస‌రికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రితోపాటు అమిత్షాతోపాటు ఇత‌ర మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల‌తో స‌న్నిహిత సంబంధాలు నెర‌పుతున్నారు. ఎటుపోయి ఎటువ‌చ్చినా ఇప్పుడు ప్ర‌కాష్ రాజ్‌కు మ‌ద్ద‌తిచ్చి కొరివితో త‌ల‌గోక్కోవ‌డం ఎందుకులే అన్నాలోచ‌న‌తో ఆ పార్టీ ఉండిఉండ‌వ‌చ్చ‌ని, అందుకే ప్ర‌కాష్ రాజ్‌కు మ‌ద్ద‌తిఇచ్చి ఉండ‌క‌పోవచ్చ‌ని ప‌లువురు సినీ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

maa