త్వరలో ఏపీ ప్రభుత్వం మంత్రివర్గ సమావేశం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రులతో సమావేశం అయ్యే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇప్పుడు అత్యధికంగా బొగ్గు కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మంత్రివర్గంలో చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ కోతలను అదుపు చేయడానికి రాష్ట్రప్రభుత్వం కేంద్రంతో ఇప్పటికే చర్చ జరుపుతుందని అంటున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో విద్యుత్ కోతలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో గ్రామ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మరి ఏ చర్యలు తీసుకుంటారనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap