ముఖ్యమంత్రి వైయస్ జగన్ త్వరలో ఎంపీలతో సమావేశం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఎంపీలతో ఆయన రాష్ట్రంలో పలు సమస్యల గురించి సమావేశమై కేంద్రం వద్ద ప్రస్తావించే అంశాల గురించి వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి అలాగే విద్యుత్ కోతలు గురించి ప్రస్తావించాలని విద్యుత్ సంక్షోభాన్ని కేంద్రం తీర్చే విధంగా కృషి చేయాలని జగన్ కోరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా కొంతమంది ఎంపీలకు జగన్ వార్నింగ్ కూడా ఇచ్చే అవకాశముందని ఢిల్లీ వెళ్లిన సరే పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా కొంత మంది వ్యక్తిగత కార్యక్రమాలు చూసుకుంటున్నారని దీనిపై జగన్ సీరియస్ గా ఉన్నారని దీనిపై కూడా ఎంపీలకు క్లాస్ పీకే అవకాశాలు ఉండవచ్చని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను ఎంపీలు కేంద్రం వద్ద ప్రస్తావించక పోతే ఇబ్బందులు రావచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: