కోహినూర్ వ‌జ్రం గురించి, దాని విలువ గురించి ప్ర‌పంచం మొత్తానికి తెలుసు. ఇప్పుడు మా మాజీ అధ్య‌క్షుడు సీనియ‌ర్ న‌రేష్ కూడా మాను కోహినూర్ వ‌జ్రంతో పోల్చారు. సంస్థ చిన్న‌దా?  పెద్ద‌దా? అనేదాంతో సంబంధం లేద‌ని, కోహినూర్ వ‌జ్రం కూడా చిన్న‌గానే ఉంటుంద‌ని, కానీ దాని విలువ అపార‌మ‌న్నారు. ఇంత‌కీ మాలో కోహినూర్ వ‌జ్రాలు ఎవ‌రో న‌రేష్ చెప్పాలి. ఎందుకంటే నెల‌రోజులుగా రోడ్డున‌ప‌డి ప్ర‌జ‌ల ఛీత్కారాలు పొందుతూ మా సంస్థ‌ను న‌డిరోడ్డు మీద‌కు లాగి.. ఇంకా మేమంతా మా బిడ్డలం.. మా కోసం కాదు.. మా మ‌నంద‌రిదీ దానికోస‌మే ప‌నిచేస్తామంటూ డ‌బ్బాలు ప‌లికారు ఇరువైపులా బృందాలు. ఆ డ‌బ్బాలన్నీ ఒట్టిడ‌బ్బాలేన‌ని తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ అర్థ‌మైపోయింది. వీరిలో ఎవ‌రికీ క‌ళాకారుల‌కు న్యాయం చేయాల‌ని, వారిని ఆదుకోవాల‌ని లేదు. ఎవ‌రికివారు పైచేయి సాధించాల‌ని, త‌మ‌దే ఆధిప‌త్యం అని నిరూపించుకోవాల‌నే త‌ప‌న‌తో మాటల యుద్ధం చేశారు. అస‌లు విష‌యాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించారు. మ‌రికొంద‌రు తెర‌వెన‌క రాజ‌కీయాలు న‌డిపారు. ఇంకొంద‌రు తెర‌ముందు రాజ‌కీయాలు చేశారు. వెర‌సి వీరంతా రాజ‌కీయ నేత‌ల‌క‌న్నా త‌క్కువ‌కాదు.. వారే న‌యం అనిపించుకునేలా చేశారు. ఇలాంటివారిని న‌రేష్ వ‌జ్రాల‌తో పోల్చ‌డంపై విమ‌ర్శ‌లు రాకుండా చూసుకుంటే మంచిది..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

maa