మంచు విష్ణు మా అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత మాజీ అధ్య‌క్షుడు న‌రేష్ మాట్లాడారు. ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిందేదో జ‌రిగిపోయింది.. ఇక‌నుంచి మా అభివృద్ధి కోసం ప‌నిచేద్దామ‌న్నారు. అస‌లు ఏం అయిపోయింద‌ని ఆయ‌న  మాట్లాడుతున్నారో అర్థం కావ‌డంలేద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. జ‌రిగింది ఏమ‌న్నా చిన్న విష‌య‌మైతే అలాగే అయిందేదో అయిపోయిందిలే అనుకోవ‌చ్చ‌ని, తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ ప‌రువును, న‌టుల ప‌రువు ప్ర‌తిష్ట‌ల‌ను రోడ్డుకు లాగి అల్ల‌రి చేసిన త‌ర్వాత అయిందేదో అయిపోయిందిలే అంటే ఎలా చెల్లుబాట‌వుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. భ‌విష్య‌త్తు కోసం ప‌నిచేద్దామ‌ని న‌రేష్ అంటున్నారు. అంత‌వ‌ర‌కు బాగానేవుంది కానీ క‌లిసి ప‌నిచేయ‌డానికి ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గం సిద్ధంగా లేదు. ఆ ప్యానెల్ త‌ర‌ఫున గెలిచిన 11 మంది రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఎవ‌రిని నియ‌మిస్తారో తెలియ‌దు. ఒక‌వేళ నియ‌మిస్తే కోర్టుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇంక మా పాల‌న స‌జావుగా ఎక్క‌డ సాగుతుంది.. అభివృద్ధి ప‌నులు ఎలా జ‌రుగుతాయి. ఒక చిన్న ప‌ద‌వి కోసం ఎత్తుకు పై ఎత్తులు.. ఒక‌రిపై మ‌రొక‌రు ప్ర‌త్యారోప‌ణ‌లు.. ఒక‌ర‌కంగా ఫ్యాక్ష‌న్ లేకుండా రాజ‌కీయాలు న‌డిచాయి. అదొక్క‌టే సంతోషించాల్సిన విష‌యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

maa