మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ముగిశాయి. మంచు విష్ణు గెలిచారు. ప్ర‌కాష్ రాజ్ ఓడారు. కొత్త కార్య‌వ‌ర్గం బాధ్య‌త‌లు చేప‌ట్టింది. అంత‌వ‌ర‌కు బాగానేఉందికానీ ఈ ఎన్నిక‌ల వెన‌క‌, ఎన్నిక‌ల ప్ర‌చారం వెన‌క ఒక అదృశ్య శ‌క్తి హ‌స్తం ఉంద‌ని ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ త‌న కొత్త‌ప‌లుకు వ్యాసంలో రాశారు. మా అసోసియేష‌న్లో కుల‌చిచ్చు పెట్టార‌ని, ఆ చిచ్చును ఏపీలో రాజ‌కీయ అవ‌స‌రాల‌కు వాడుకోవాల‌ని చూస్తున్నార‌ని రాధాకృష్ణ తెలిపారు. మంచు కుటుంబం క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌దికాగా, ప్ర‌కాష్ రాజ్‌కు మ‌ద్ద‌తిచ్చిన చిరంజీవి కుటుంబం కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌ది. ఈ రెండు వ‌ర్గాల మ‌ధ్య పోటీ జ‌రిగి క‌మ్మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన విష్ణు గెలుపొందారు.. కాపులు ఓట‌మిపాల‌య్యారంటూ ఏపీలో ప్ర‌చారం జ‌రుగుతోంది. రాబోయే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే యోచ‌న‌లో ఉన్నార‌న్న ఉద్దేశంతో అధికార పార్టీ కి చెందిన అదృశ్యశ‌క్తి ఈ ప్ర‌చారం నిర్వ‌హిస్తోంది. ఈసారి కూడా క‌మ్మ సామాజిక‌వ‌ర్గాన్ని బూచిగా చూపించి ఎన్నిక‌ల‌కు వెళ‌దామ‌నే యోచ‌న‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. త‌న విఫ‌ల పాల‌న‌వ‌ల్ల న‌ష్టం చేకూర్చ‌కుండా ఉండేందుకే ఇటువంటి ప్ర‌ణాళిక‌లు అల్లుతున్నార‌ని వేమూరి రాధాకృష్ణ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa