ద‌స‌రా పండ‌గ త‌ర్వాత‌రోజు ప్ర‌తి ఏడాది ‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం జ‌ల‌విహార్‌లో జ‌రుగుతుంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు క‌లుసుకుంటారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ ఏడాది కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. టాలీవుడ్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ గవవర్నర్ తమిళ సై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఈ ద‌త్త‌న్న అలయ్ బలయ్‌ కార్యక్రమానికి హాజ‌రు కానున్నారు.  తెలుగురాష్ట్రాల మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం పాల్గొని ఎటువంటి అర‌మ‌రిక‌లు లేకుండా క‌లిసిపోతారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ సంసృతి ఉట్టిపడే కళాకారుల నృత్యాలతోపాటు తెలంగాణ వంటకాలు ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేకంగా నిలుస్తాయి. దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం, అర‌మ‌రిక‌లు లేకుండా క‌లిసి జీవిద్దామ‌నే సంకేతానివ్వ‌డం ఈ  అలయ్ బలయ్ ప్రత్యేకత. తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని న‌టులంద‌రికి కూడా ఈ అల‌య్ బ‌ల‌య్ పెడితే బాగుంటుంద‌నే వ్యాఖ్య‌లు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: