తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అధ్యక్ష ఎన్నికకు ఆదివారం ఉదయం షెడ్యూల్ విడుద‌ల చేశారు. రిటర్నింగ్‌ అధికారిగా శ్రీనివాస్‌రెడ్డి వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ, ఈనెల 23న స్క్రూటినీ, 24న నామినేషన్ల ఉపసంహరణ, 25న పార్టీ అధ్యక్ష ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. ఆదివారం మధ్యాహ్నం 2.00 గంటలకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగబోతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికపై సుదీర్ఘంగా చ‌ర్చించ‌నున్నారు. అలాగే ఈనెల 25న జరగనున్న ప్లీనరీపై కూడా స‌మావేశంలో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం వ్యూహాలు,  ముందస్తు ఎన్నికలకు వెళ్ల‌డం.. త‌దిత‌ర అంశాల‌పై ఒక స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. సోమవారం ఉదయం 11.00 గంటలకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ తరపున.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నామినేషన్లు స‌మ‌ర్పించ‌నున్నారు. ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌కోసారి తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ అధ్య‌క్షుడిని ఎన్నుకుంటారు. ఈసారి కూడా కేసీఆర్ ను ఎన్నుకుంటారా?  కేటీఆర్ ను ఎన్నుకుంటారా? అనే ఉత్కంఠ నెల‌కొందికానీ వివాదాల‌కు తావివ్వ‌కుండా కేసీఆరే నిల‌బ‌డుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: