ద‌స‌రా పండుగ రోజు అంద‌రూ సుఖ‌, సంతోషాల‌తో ఉత్స‌వాలు జ‌రుపుకుంటారు. కానీ ఓ ఎమ్మెల్యే అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ద‌స‌రా వేడుక‌ల్లో గాలిలోకి కాల్పులు జ‌రిపారు. పోలీసులు సైతం అత‌నిపై కేసు న‌మోదు చేశారు. క‌ర్నాట‌క‌లో ఈ అంశం సంచ‌ల‌న‌మైంది. క‌ర్నాట‌క‌లోని కోలూరు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కేవై నంజేగౌడ ద‌స‌రా ఉత్స‌వాల‌లో   లైసెన్స్ తుపాకితో గాలిలోకి కాల్పులు జ‌రిపారు. మాలూరు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కొమ్మ‌న‌హ‌ళ్లి గ్రామంలోని జ‌మ్మిచెట్టు వ‌ద్ద ఆయుదాల‌కు పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం ఎమ్మెల్యే నాలుగు రౌండ్లు కాల్పులు చేప‌ట్టారు. కానీ ఎమ్మెల్యే సోద‌రుడు నంజేగౌడ పేరు మీద తుపాకీ లైసెన్స్ ఉంది.
 
కాల్పుల‌కు సంబంధించి ప‌లు వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌య్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేశారు. తుపాకీ లైసెన్స్ క‌లిగిన వ్య‌క్తిపై, ఎమ్మెల్యే నంజేగౌడ ఇద్ద‌రిపై కేసు న‌మోదైంది. బ‌హిరంగ ప్ర‌దేశంలో కాల్పులు జ‌రిపిన ఎమ్మెల్యే చ‌ట్టాన్ని ఉల్లంఘించార‌ని పోలీసులు వెల్ల‌డించారు. మ‌రోవైపు కొమ్మ‌న‌హ‌ళ్లి గ్రామంలో గాలిలోకి కాల్పులు చేప‌ట్ట‌డం సంప్ర‌దాయం అని గ్రామ‌స్తులు పేర్కొంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: