దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనిపై విపక్షాలు అన్నీ కూడా కాస్త సీరియస్ గా ఉన్నాయి. 2014 తర్వాత కేంద్ర ప్రభుత్వం భారీగా పెట్రోలు ధరలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్గా చేసుకుని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ నేతృత్వంలో కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి ప్రణాళికలు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

పెట్రోల్ ధరకు సంబంధించి పలు రాష్ట్రాల్లో పనులను తగ్గించే విధంగా నిరాహార దీక్షలు చేసే విధంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ నిరాహారదీక్షకు దిజ్ అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. త్వరలో నిరాహార దీక్ష తేదీలను ప్రకటించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: