అదానీ గ్రూప్ గురించి భార‌త‌దేశంలోనేకాదు.. ప్ర‌పంచ‌లోనే ఇప్పుడు తెలియ‌నివారు లేరు. ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర‌మోడీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత అదానీ గ్రూప్‌న‌కు ఎదురులేకుండా పోయింది. అదాయ‌పుప‌న్నుశాఖ‌, సీబీఐ, ఈడీని అడ్డం పెట్టుకొని అడ్గ‌గోలుగా వ్యాపారాలు పెంచుకుంది. ఇందుకు ఎంచుకున్న మార్గ‌మే ఈస‌డించుకునేలా ఉంది. ఎవ‌రేమ‌నుకుంటే నాకెందుకు.. అనే ధోర‌ణిలో వెళుతున్న అదానీ గ్రూప్‌న‌కు ఏపీ ప్ర‌భుత్వం ఇతోధికంగా స‌హ‌క‌రిస్తోంది. గంగ‌వ‌రం పోర్టు అమ్మితే రూ.10వేల కోట్లు ఇస్తాన‌ని చెప్పిన అదానీ బేరానికి ఆ సంస్థ ఒప్పుకోలేదు. ఇది జ‌రిగింది కొన్ని సంవ‌త్స‌రాల క్రితం. దాన్ని స‌గం ధ‌ర‌కే ద‌క్కించుకోక‌పోతే నా పేరు అదానీ కాద‌నే రీతిలో స‌న్నిహితుల‌వ‌ద్ద స‌వాల్ చేశారు. సైప్ర‌స్‌లో తెలిసిన‌వారికి 25వేల డాల‌ర్లు పంపించిద‌న్న విష‌యాన్ని బూచిగా చూపించి ఈడీని ఉసిగొలిపి వారి క‌ష్టార్జితాన్ని కారుచౌక‌గా ద‌క్కించుకుంది. వీరికి త‌గ్గ‌ట్లుగానే జ‌గ‌న్ స‌ర్కార్ అన్నివిధాలా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంది. ఒక‌ర‌కంగా అదానీ గ్రూప్‌తో క‌లిసి వ్యాపార భాగ‌స్వామిగా అధికార వైసీపీ నేత‌లు ఉన్నారంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఎంత‌వ‌ర‌కు నిజ‌మో వారికే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: