ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధికారం చేప‌ట్టిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల్లో ఆర్థికంగా మ‌రింత బ‌ల‌ప‌డ్డార‌ని ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ త‌న కొత్త‌ప‌లుకు వ్యాసంలో రాశారు. ఆర్థికంగా మ‌రింత బ‌ల‌ప‌డితే కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అవ‌కాశం ఉంటుంద‌నేది జ‌గ‌న్ అంచ‌నాగా చెప్పారు. ఈ విష‌యంలో ఆయ‌న అదానీ స‌హాయం కోరుతున్నార‌ని, వ్యాపార‌ప‌రంగా అదానీతో క‌లిసిచేసే అవ‌కాశం ఉంద‌ని రాధాకృష్ణ రాసుకొచ్చారు. ఇదే నిజ‌మైతే అదానీకి ఏపీలో ఎదురే ఉండ‌దు. ఇప్ప‌టికే అదానీ గ్రూప్ బీచ్‌శాండ్ వ్యాపారంపై దృష్టిసారించింద‌ని, ఇందులో భాగంగానే హెటెరో ఎండీ పార్థ‌సార‌ధిరెడ్డి చేత బేపార్క్ హోట‌ల్‌ను కొనుగోలు చేయించిన‌ట్లు తెలుస్తోంది. కేసుల నుంచి బ‌య‌ట‌ప‌డాలంటే అదానీ స‌హ‌కారం అవ‌స‌రం. ఎందుకంటే అదానీ లేక‌పోతే మోడీ లేరు.. మోడీ లేక‌పోతే అదానీ లేరు అన్న‌ట్లుగా వీరి స్నేహం గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి మోడీ ఉన్న స‌మ‌యం నుంచి కొన‌సాగుతోంది. కేంద్రంలో ఈసారి కూడా మోడీ అధికారంలోకి రావాలి.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలి అనే కోణంలోనే అధికార పార్టీ ఏపీలో పావులు క‌దుపుతోంద‌ని రాధాకృష్ణ వ్యాసంలో స్ప‌ష్ట‌మ‌వుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: