మా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన ప్ర‌కాష్ రాజ్ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ప్పుడు ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఎవ‌రైనా కుటుంబం అంటేనే డేంజ‌ర్ అని, అంద‌రూ ఒకే కుటుంబం అయిన‌ప్పుడు ఎన్నిక‌ల‌కు అవ‌కాశం ఎక్క‌డుంటుంద‌న్నారు. సొసైటీ యాక్ట్ కు కూడా వెళ్ల‌ర‌న్నారు. కుటుంబం అనేది కేవ‌లం క‌ల్పిత‌మ‌న్నారు. వెన‌కాల ఎవ‌రెవ‌రో ఉంటారు. తెర‌పైకి రారు. వెన‌కాలే ఉండి యుద్ధం చేస్తుంటారు. నాకొచ్చిన ఓట్లు జెన్యూన్ అని ప్ర‌కాష్ రాజ్ చెప్పారు. 150 మంది స‌భ్యులు యాక్టివ్‌గా లేర‌ని, వారిని కూడా తెచ్చి ఓట్లు వేయించార‌ని, అది పోల్ మేనేజ్‌మెంట్ అని, యాక్టివ్‌గా లేనివారు కృష్ణ‌న‌గ‌ర్ స‌మ‌స్య‌లు ఎలా తెలుస్తాయ‌ని, వారు వాటిని ఎలా ప‌రిష్క‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. త‌న వెన‌క ఎవ‌రూ లేర‌ని, తాను ఒక‌రికి న‌చ్చినంత‌మాత్రాన త‌న వెన‌క ఎవరూ ఉన్న‌ట్లు కాద‌న్నారు. విష్ణును ఉప‌సంహ‌రించేలా చేయండి అని చిరంజీవి మోహ‌న్‌బాబుకు చెప్పింది నిజం కావ‌చ్చు.. అబ‌ద్దం కావ‌చ్చు అని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa