దేశంలో 18 సంవ‌త్స‌రాల్లోపు చిన్నారుల‌కు క‌రోనా టీకా త‌యారీపై హేతుబ‌ద్ద‌త‌,  శాస్త్రీయ‌త‌పై స్ప‌ష్ట‌త రావ‌డంతోపాటు స‌ర‌ఫ‌రా ఎంత‌వ‌ర‌కు చేయ‌గ‌ల‌ర‌నే అంశాల్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న త‌ర్వాత అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది కొవిడ్ టాస్క్ ఫోర్స్ అధిప‌తి వీకే పాల్ చెప్పారు. దేశంలో కొవిడ్ ముప్ప త‌గ్గిపోయింద‌ని చెప్ప‌లేమ‌ని, ఇప్పుడు పండ‌గ‌ల సీజ‌న్ కావ‌డంతో ప్ర‌జ‌లు గుమిగూడుతున్నార‌ని, రాబోయే రెండు నెల‌లు జాగ్ర‌త్త‌గా ఉంటే చాల‌న్నారు. రెండు ద‌శ‌ల ఉధృతి త‌గ్గిన త‌ర్వాత కూడా కొన్ని దేశాల్లో ఈ మ‌హ‌మ్మారి విజృంభిస్తోంద‌ని, కొన్ని దేశాల్లో చిన్నారుల‌కు టీకాలు వేస్తున్నార‌ని, మ‌న‌దేశంలో కూడా దాని తీయారీ విధానాల‌పై నివేదిక, ఆ త‌ర్వాత స‌ర‌ఫ‌రాకు సంబంధించిన అంశాల‌ను ప‌రిశీలించి వాక్సినేష‌న్‌పై తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. వాక్సినేష‌న్ వేయ‌డంలో ప‌లు రాష్ట్రాలు వెన‌క‌బ‌డ్డాయ‌ని, అవి వేగం పెంచాల‌ని కోరారు. అంతేకాకుండా దేశంలో టీకాలు వేయ‌డానికి సిరంజిలు లేవ‌నే ప్ర‌చారం న‌డుస్తోంద‌ని, అదంతా అబ‌ద్ద‌మ‌ని, అటువంటి ప్ర‌చారం న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఎన్ని టీకాలు వేసినా స‌రిప‌డ‌నంత సిరంజిలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: