తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ ప్లీన‌రీ స‌న్నాహ‌క స‌మావేశాలు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్య‌క్ష‌త‌న తెలంగాణ భ‌వ‌న్‌లో ప్రారంభ‌మ‌య్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల వారిగా టీఆర్ఎస్ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ అవుతున్నారు. ఈరోజు దుబ్బాక‌, సిరిసిల్ల‌, సంగారెడ్డి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. వ‌రంగ‌ల్‌లో నిర్వ‌హించే విజ‌య‌గ‌ర్జ‌న స‌భ‌కు భారీగా పెద్దఎత్తున త‌ర‌లిరావాల‌ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. మండ‌లాల వారిగా నాయ‌కుల‌కు జ‌న‌స‌మీక‌ర‌ణ కోసం బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఆయా నియోజ‌క‌వ‌ర్గంలో నాయ‌కుల‌కు, కిందిస్థాయి నాయ‌క‌త్వానికి మ‌ధ్య సంబంధం ఏవిధంగా ఉంద‌నే విష‌యంపై మంత్రి ఆరాతీశారు. ఇక నుంచి కిందిస్థాయి నుంచి పై స్థాయి వ‌ర‌కు అంద‌రికీ అందుబాటులో ఉంటాన‌ని వెల్ల‌డించారు మంత్రి.  నియోజ‌క‌వ‌ర్గంలో ఏ స‌మ‌స్య ఉన్నా నేరుగా త‌న‌ను క‌ల‌వ‌వ‌చ్చ‌ని కోరారు. గ్రామ‌స్థాయి నుండి రాష్ట్రస్థాయి వ‌ర‌కు పార్టీ అభివృద్ధి కోసం అంద‌రూ క‌ష్ట‌ప‌డి చేయాల‌ని సూచించారు. ప్ర‌తి ఊరి నుంచి వ‌రంగ‌ల్‌కు త‌ర‌లిరావాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: