సీనియ‌ర్ టీడీపీ లీడ‌ర్ , మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఇవాళ గులాబీ గూటికి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కు పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు కేసీఆర్. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. అనేక ఏళ్లుగా త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన నా య‌కులు మోత్కుప‌ల్లి అన్నారు. తెలంగాణ స‌మాజంలో గ‌తంలో అనేక ఇబ్బందులు తలెత్తాయ‌ని, అదేవిధంగా మోత్కుప‌ల్లి వి ద్యుత్ శాఖ మంత్రిగా ప‌నిచేసిన‌ప్పుడూ అనేక స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయ‌ని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి గుర్తింపు పొందార‌ని, అనేక ప‌ద‌వులు నిర్వ‌హించి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. తాను మంత్రిగా ఉన్న‌ప్పుడు తెలంగాణ‌కు పెట్టుబ డులు రావ‌ని ఓ ముఖ్య‌మంత్రి గ‌తంలో అన్నార‌ని, కానీ అవ‌న్నీ కాద‌ని తాను తెలంగాణ సాధించాన‌ని అన్నారు. తాను ఉద్య‌మం చేసిన‌ప్పుడు కూడా త‌న‌ను చంపేస్తార‌న్న సంకేతాలు వ‌చ్చాయ‌ని ఇవేవీ కాద‌ని రాష్ట్రం సాధించాన‌ని చెప్పారు. దేశ రాజ‌కీయ వా తావ‌ర‌ణాన్ని మొత్తం ఏకాభిప్రాయం సాధించే దిశ‌గా ఆ రోజు తాను కృషి చేశాన‌ని అన్నారు. తెలంగాణ సాధ‌న‌లో అనేక ఆటుపోట్లు చ‌వి చూశాను..అవి అంద‌రికీ తెలిసిందే అంటూ గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్ప‌డ్డాక కూడా స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని,వాటిని కూ డా అధిగ‌మించేందుకు తాను కృషి చేశానని చెప్పారు. నీళ్లు ల‌భ్యం అవుతుండడం, క‌రెంట్ స‌ర‌ఫ‌రాలో అంత‌రాయాలు లేక‌పోవ డంతో చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయి, ఇవాళ ఎవ‌రి బ‌తుకువాళ్లు బ‌తుకుతున్నార‌ని, గ్రామాలు బాగున్నాయ‌ని, బాగు ప‌డ్డా యని అన్నారు. రైతు బంధు, రైతు బీమాలు మంచి ఫ‌లితాలు ఇస్తున్నాయ‌ని, అలానే చేనేత కుటుంబాలు కూడా ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డం మానుకున్నాయ‌ని చెప్పారు. బంగారు తెలంగాణ రాకున్నా సొంత రాష్ట్రంలో కొన్ని సాధించాన‌ని స్ప‌ష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: