IHG
శ్రీలంక మొదటి టెస్ట్ క్రికెటర్ బందుల వర్ణపుర (68) సోమవారం తుదిశ్వాస విడిచారు. షుగర్ లెవల్స్ తీవ్రం గా పడిపోవడం తో అతను చనిపోయినట్లుగా అతని వైద్యులు తెలిపారు.  శ్రీలంక తరపున ఆడిన తోలి క్రికెటర్ గా అయన పేరు లికించబడింది. శ్రీలంక తరుపున మొదటి బంతిని ఎదుర్కొన్న బ్యాట్స్ మ్యాన్ గా , శ్రీలంక తరపున బంతిని వేసిన మొదటి బౌలర్ గా ఇంకా శ్రీలంక తరపున తోలి పరుగు తీసిన ఆటగాడిగా తనపేరు రికార్డు సృష్టించుకున్నాడు. ఈయన 1 మార్చి 1953 జన్మించారు. 7 జూన్ 1975 లో పాకిస్తాన్ తో జరిగిన వన్ డే మ్యాచ్  తో ఇతని అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమయ్యింది. ఇతను నాలుగు టెస్ట్ మ్యాచ్ లను , 12 వన్డేలను శ్రీలంక తరుపున ఆడాడు.

IHG
బందుల వర్ణపుర నలంద విశ్వ విద్యాలయం లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసారు. 18 అక్టోబర్ 2021 షుగర్ లెవల్స్ పడిపోవడం తో అయన తుది శ్వాస విడిచారు. బందుల వర్ణపుర గత కొంత కాలంగా షుగర్ సమస్యతో హాస్పిటల్ లో చేర్పించగా షుగర్ కారణంగా అతని ఎడమ కాలును తొలగించారు. ఆతరువాత చికిత్స తీసుకుంటున్న తరుణం లో షుగర్ లెవల్ పూర్తి గా తగ్గిపోయి చనిపోయారు. ఈ యన శ్రీలంక టీమ్ కోచ్ గా కూడా కొంత కాలం పనిచేసారు. మహిళా జయవర్దనే ,  రస్సెల్ ఆర్నాల్డ్ లు  ఇతని ప్రియా శిష్యులు , శ్రీలంక తరపున ఆడిన మాదవ వర్ణపుర ఇతని మేనల్లుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: