ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. క‌రోనాతో మ‌ర‌ణించిన ప్ర‌భుత్వ ఉద్యోగుల కుటుంబాల్లో ఒక‌రికి కారుణ్య నియామ‌కం కింద ఉద్యోగం ఇవ్వాల‌ని అధికారుల‌కు ఆదేశాలు జారీచేశారు. న‌వంబ‌ర్ 30 నాటికి ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ పూర్తి చేయాల‌ని సూచించారు.
 
మ‌రోవైపు క‌రోనా కార‌ణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. దీంతో కొంత మందికి కుటుంబ పెద్ద చ‌నిపోవ‌డంతో వారి కుటుంబం గ‌డిచేందుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే ప‌రిస్థితి నెల‌కొంది. క‌రోనా సెకండ్‌వేవ్లో చాలా మంది ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఉద్యోగులు మృతి చెందిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారికి ప్ర‌భుత్వం ఉద్యోగం క‌ల్పించ‌డం ద్వారా వారి కుటుంబానికి ఎంతో ఆస‌రాగా ఉంటుంద‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యం చాలా అభినందించ‌ద‌గ్గ విష‌యం అని ప‌లువురు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా బాధిత కుటుంబాలకు కాస్త ఊర‌ట‌నిచ్చేందుకు కారుణ్య నియామ‌కం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: