గ‌త కొద్ది రోజుల నుంచి కేర‌ళ‌లో వ‌ర్షం విప‌రీతంగా వ‌చ్చి వ‌ణుకుపుట్టించింది. వ‌ర్షానికి వ‌ర‌ద‌లు భీభ‌త్సంగా మారాయి. దీంతో కేర‌ళ‌లో ఎక్క‌డ చూసినా నీటిమ‌యంగా మారింది. న‌దుల‌న్ని ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తూనే ఉన్నాయి. ఎడ‌తెరిపిలేకుండా వ‌ర్షాలు కుర‌వ‌డంతో కొండ చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 27 మంది మృతిచెందారు.  గ‌ల్లంతు కావ‌డంతో ప‌లువురి ఆచూకి తెలియ‌డం లేదు.  కొండ‌చ‌రియ‌లు ప‌డిన చోట స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు.
 
ఇది ఇలా ఉండ‌గా కొట్టాయం జిల్లాలో ఒక ఇల్లు  వ‌ర‌ద ఉధృతి తాకిడికి అమాంతం కొట్టుకుపోయింది. ఇల్లు వ‌ర‌ద‌లో కింద ప‌డి కొట్టుకుపోయిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ముంద‌కాయం ప్రాంతంలో మ‌ణిమాల న‌దికి వ‌ర‌ద నీరు విఫ‌రీతంగా పోటెత్తింది. దీంతో న‌ది ఒడ్డున ఉన్న ఇల్లూ అంద‌రూ చూస్తుండ‌గానే నీటిలోంచి కింద ప‌డింది.  ఆ వ‌ర‌ద తాకిడికి కొట్టుకుపోయింది. ఆ స‌మ‌యంలో ఇంట్లో ఎవ‌రు లేరు. దీంతో ప్ర‌మాదం త‌ప్పింది. ముంపును ముందుగానే గుర్తించి అధికారులు ముంపు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను ముంద‌స్తుగానే సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. ఆ ఇంట్లో ఎవ‌రైనా ఉంటే వారి ప‌రిస్థితి ఏమిటి అని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. ఆ వీడియోను ప‌లు కామెంట్ల‌ను చేస్తున్నారు నెటిజ‌న్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: