హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉపఎన్నిక నేప‌థ్యంలో ఇటీవ‌ల కేంద్ర ఎన్నిక‌ల సంఘం ద‌ళిత‌బంధు నిలిపి వేయాల‌ని ఆదేశించిన విష‌యం విధిత‌మే. దీంతో టీఆర్ఎస్‌, బీజేపీ నేత‌ల మ‌ధ్య ప‌ర‌స్ప‌రం మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ఇక అంత‌టితే ఆగ‌లేదు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద్‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. బీజేపీ మూలంగానే  కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిలిపివేసిన‌ది అని నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. హ‌న్మ‌కొండ జిల్లాలో ఉన్న ఉప్ప‌ల్‌, మ‌ర్రిప‌ల్లి, క‌మ‌లాపూర్ గ్రామాల‌లో ఈట‌ల దిష్టి బొమ్మ ద‌హ‌నం చేశారు టీఆర్ఎస్ శ్రేణులు.

 మేము ఏమ‌న్నా త‌క్కువా అని సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ ద‌గ్దం చేశారు బీజేపీ నాయ‌కులు. దీంతో ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ది హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో..  మ‌రోవైపు ద‌ళిత‌బంధుకు బ్రేక్‌రావ‌డానికి కార‌ణం సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్రఅధ్య‌క్షుడు బండిసంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కూడ బీజేపీ నేత‌ల‌పై మండిప‌డ్డారు.  ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ఆపాల‌ని ఆగ‌స్టులో ప‌ద్మ‌నాభ‌రెడ్డి ఫిర్యాదు చేశాడు. ఇన్ని రోజులు ఆప‌కుండా తీర ఎన్నిక‌ల స‌మ‌యం ద‌గ్గ‌రికొచ్చిన‌ప్పుడు నిలిపివేయాల‌ని తీసుకున్న నిర్ణ‌యం హాస్యంగా ఉంద‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: