మా అధ్య‌క్షుడిగా మంచు విష్ణు ఎన్నిక‌య్యారు. ప్ర‌మాణ స్వీకారం చేశారు. అంత‌క‌న్నా ముందుగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. దీనివ‌ల్ల ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని కోర్టుకెళ్ల‌నీయ‌కుండా నిలువ‌రించిన‌ట్లైంది. బాధ్య‌త‌లు చేప‌ట్ట‌క‌ముందే కోర్టుకు వెళ్లివుంటే విష్ణు వ‌ర్గాన్ని అడ్డుకోవ‌డ‌మ‌నేది ప్ర‌కాష్ రాజ్ వ‌ర్గానికి వీల‌య్యేది. ఇప్పుడు ఆ అవ‌కాశం లేదు. విష్ణు ప్యానెల్ స‌భ్యులంతా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఎవ‌రికి వారు సైలెంట‌య్యారు. నిన్న‌టివ‌ర‌కు ర‌చ్చ రచ్చ జ‌రిగిన తెలుగు ఫిల్మ్‌న‌గ‌ర్ శాంతించింది. ఇదంతా యుద్ధానికి ముందు ఉండే ప్ర‌శాంత‌తా?  లేదంటే యుద్ధం ముగిసిన త‌ర్వాత ఉండే ప్ర‌శాంత‌తా? అనేది మా స‌భ్యులే తేల్చుకోవాలి. ఎవ్వ‌రూ పేద క‌ళాకారుల‌ను ఎలా ఆదుకోవాలి?  వారికి ఏం చేయాలి? అనే విష‌యం ఆలోచించ‌డంలేదు. వారెట్లా గెలుస్తారు?  మేమెందుకు ఓడిపోయాం?  ప్ర‌త్య‌ర్థి వ‌ర్గాన్ని నిలువ‌రించేలా కుయుక్తులు.. రాజ‌కీయ నేత‌ల‌కు తీసిపోని రీతిలో ఎత్తుకు పై ఎత్తులు.. ఇలా రాజ‌కీయం మొత్తం ఔపోస‌న ప‌ట్టి పార్టీ నేత‌లంద‌రిచేతా ఔరా! అనిపించుకుంటున్నారు. కాబ‌ట్టే వీరంతా సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి రాగ‌లిగినా విజ‌య‌వంతం కాగ‌లిగారంటున్నారు తెలుగు సినీ ప్రియులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

maa