ద‌ళిత‌బంధు పై తెలంగాణ రాష్ట్ర స‌మితి,  భార‌తీయ జ‌న‌తా పార్టీల మ‌ధ్య పెద్ద మాట‌ల యుద్ధ‌మే జ‌రుగుతున్న‌ది. ఇటీవ‌ల ఈట‌ల దిష్టిబొమ్మ‌ను టీఆర్ఎస్ నాయ‌కులు ద‌గ్దం చేసిన విష‌యం విధిత‌మే. తాజాగా ఈట‌ల ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా దానిపై స్పందించారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను కొన్ని డిమాండ్ల‌ను అడుగుతున్నాను. కేవ‌లం వాటికి స‌మాధానం చెప్పాలని పేర్కొన్నారు.

కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి ఇన్ని ఏండ్లు అవుతున్నా.. ద‌ళితులు ఎందుకు గుర్తుకు రాలేదు. ఇప్పుడే ద‌ళితుల్లో వెలుగులు నింపాల‌నే ఆలోచ‌న వ‌చ్చిందా అని ప్ర‌శ్నించారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కంలో రూ.10ల‌క్ష‌ల‌పై క‌లెక్ట‌ర్ల పెత్త‌నం తీసేసి నేరుగా ఆ కుటుంబానికి అవ‌కాశం క‌ల్పించాలి. ఇది ద‌ళితుల మీద ఉన్న‌ ప్రేమ‌తో ఇచ్చేవా.. ఓట్ల కోసం ఇచ్చేవా..?  రాష్ట్రం మొత్తం ఇవ్వాలి. కేవ‌లం హుజూరాబాద్‌లోనే  ఇవ్వ‌డం అంటే ఎన్నిక‌ల కోసం ఇస్తున్న‌ట్టే అని డిమాండ్ చేశారు. పేద‌రికానికి, కులానికి అస‌లు సంబంధం లేదు. అన్ని కులాల‌లో పేద‌లు ఉన్నారు.  ద‌ళితుల పేద‌రికంలో ముందున్నారు. వారి త‌రువాత సంచార జాతులు కూడ పేద‌రికంలోనే ఉన్నారు. వారంద‌రికీ ఇలాంటి ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయాల‌ని డిమాండ్ చేశారు ఈట‌ల‌.


మరింత సమాచారం తెలుసుకోండి: