యాదాద్రి పుణ్య‌క్షేత్రానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్‌రావు కాసేప‌టి క్రిత‌మే చేరుకున్నారు. బేగంపేట విమానాశ్ర‌యం నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో బ‌య‌లు దేరారు. అక్క‌డి నుంచి యాదాద్రికి చేరుకున్నారు. అక్క‌డ ఆయ‌న‌కు అధికారులు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. త‌రువాత ఆల‌య అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. అనంత‌రం ల‌క్ష్మీ న‌ర‌సింహాస్వామిని ద‌ర్శించుకున్నారు.

గ‌త నాలుగేండ్ల క్రితం యాదాద్రి పునఃనిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు. ఇందుకు రూ.1200 కోట్ల నిధులు అంచెనా వేశారు.  ఏరియల్ వ్యూ ద్వారా ఆల‌యాన్ని ప‌రిశీలించారు. మ‌ధ్యాహ్నం మూడున్న‌ర గంట‌ల త‌రువాత ఆల‌య పునఃప్రారంభ ముహుర్తానికి సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించ‌నున్నారు. ఆల‌య పునఃప్రారంభ ముహుర్తాన్ని చిన‌జీయ‌ర్ స్వామి ఖ‌రారు చేసారు. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం 15సార్లు పునఃప్రారంభ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఎంత శాతం  ప‌నులు పూర్త‌య్యాయి. ఇంకా ఎంత శాతం ప‌నులు చేప‌ట్టాల్సి ఉంది. అనేది సీఎం వెల్ల‌డించ‌నున్నారు. సీఎం ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆయ‌న‌తో పాటు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, నిన్న పార్టీలో చేరిన మోత్కుప‌ల్లి ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: