ఎంఐఎం అధినేత అస‌దుద్ధీన్ ఓవైసీ ఎప్పుడు ఏది మాట్లాడినా ఆ అంశంపై అందరూ చ‌ర్చించుకునేవిధంగా మాట్లాడుతుంటారు. తాజాగా ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముస్లిం అబ్బాయి ఎవ‌రితోనైనా తిరుగొచ్చా..? మ‌గ‌వాళ్ల‌కు ఒక న్యాయం.. ఆడ‌వాళ్ల‌కు ఒక న్యాయ‌మా..? ఇదెక్క‌డి న్యాయం.. అని పేర్కొన్నారు. ఇటీవ‌ల ఒక అమ్మాయి బుర్కా వేసుకొని బైకుపై వెళ్తుంటే కొంద‌రూ అడ్డుకున్నారు.

దీనిపై అస‌ద్ స్పందించారు. బుర్కా వేసుకోని అమ్మాయి ముస్లిం అబ్బాయితో తిరిగితే ఎందుకు ప‌ట్టించుకోరు. ఎవ‌రినైనా త‌ప్పు బ‌ట్టే ముందు మ‌న‌ల్ని మ‌నం ప్ర‌శ్నించుకోవాలి. అమ్మాయిలు ఎవ‌ర్ని ప్రేమిస్తే  మీ కెందుకు..? అమ్మాయిల‌పై దాడులు చేసే హ‌క్కు ఎవ‌రికీ లేదు.  రోడ్డుపై అడ్డుకొని దాడులు చేసే హ‌క్కు ఎవ‌రు ఇచ్చారు. మీరు ఏమైనా సౌదీ అరేబియా పోలీసులా..?  లేక మీరు ఏమైనా ద‌గ్గ‌రుండి పెళ్లి చేస్తారా..? అని ప్ర‌శ్నించారు. కాలానికి అనుగుణంగా మారాలి. ఇది 1969 సంవ‌త్స‌రం కాదు.. మ‌నం 2021లో ఉన్నాం. అందుకు త‌గ్గ‌ట్టు వ్య‌వ‌హ‌రించాలి. బుర్కా వేసుకున్న అమ్మాయి బ‌య‌ట‌కు వెళ్లితే మీకు నొప్పేంటి..? అని ప్ర‌శ్నించారు. ఇదంతా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో గురించి అస‌ద్ మాట్లాడారు. ఇక నుంచి ఎప్పుడు బుర్కా వేసుకోను అని బైకు పై వెళ్తున్న‌ ఆ యువ‌తి ప్ర‌క‌టించింది. అస‌ద్ మాట‌లు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేశాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: