దేశ వ్యాప్తంగా బీసీ జనాభా గణన విషయంలో ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా స్పీడ్ పెంచుతున్నాయి. ప్రాంతీయ పార్టీల అధినేతలు ఇప్పుడు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు అర్ధమవుతుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కి ఒక లేఖ రాసారు. బీసీ జనగణన చేపట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేసారు చంద్రబాబు. సరైన సమాచారం లేక బీసీలకు అన్యాయం జరుగుతోంది అన్నారు.

బీసీ లు చాలా వెనుకబడి ఉన్నారు అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసినా.. వారు ఇంకా వెనుకబడే ఉన్నారు అని ఇపుడు లెక్కలు 90 సంవత్సరాల నాటివి అని పేర్కొన్నారు. బీసీ జనగణన కోసం టిడిపి హయాంలో తీర్మానం చేసాము అని తెలిపారు. బీసీ జనగణన జరిగితేనే వారికి సంక్షేమ పథకాలు అంది..న్యాయం జరుగుతుంది అన్నారు. వారు సామాజిక, రాజకీయ, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: