కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్ణాటక బీజేపీ చీఫ్ నలిన్‌కుమార్ కటీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయ‌డం సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. బీజేపీ తక్షణం క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తోంది. ''రాహుల్ గాంధీ ఎవరు? నేను చెప్పడం లేదుకానీ ఆయ‌న మాదక ద్రవ్యాల బానిస, మాదక ద్రవ్యాల విక్రేత అంటూ మీడియాలో  వచ్చింది. రాహుల్ కు  కనీసం పార్టీని కూడా నడపడం రాదంటూ ఆయ‌న మాట్లాడారు. ఈ సంఘ‌ట‌న జ‌ర‌గ‌డానికి ముందు కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి  మోదీని నిరక్షరాస్యుడంటూ క‌న్న‌డంలో పోస్టు చేసింది. వెంటనే మోదీపై వచ్చిన వివాదాస్పద పోస్టును పార్టీ సోషల్ మీడియా టీమ్ తీసేసిన‌ట్లు ఆ పార్టీ క‌ర్ణాట‌క చీఫ్ డీకే శివకుమార్ ప్రకటించారు. రాహుల్‌పై నలిన్ కుమార్ కటీల్ వ్యాఖ్యలపై డీకే మంగళవారం ఘాటుగా స్పందించారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉన్నప్పటికీ వారిపట్ల గౌరవప్రదంగా, నాగరికంగా వ్యవహరించాలని సూచించారు. బీజేపీ కూడా ఈ విషయంలో ఏకీభవిస్తుందని తాను అభిప్రాయ‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: