తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ దళితులకు బంధువు కాదు... రాబందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్ దృష్టిలో దళితులు ఓటేసే యంత్రాలు మాత్రమేనని, దేశంలో అత్యంత దళిత ద్రోహి కేసీఆరేన‌ని నిప్పులు చెరిగారు. ఉపఎన్నికలు ప్రజా సమస్యల‌ మీద జరిగేవి కావ‌నివ‌, తోడు దొంగల మధ్య మాత్రమే ఇవి జ‌రుగుతున్నాయ‌న్నారు. ఆంబోతుల్లా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, ఎన్నికలను గోల్‌మాల్ చేయడానికి మామ అల్లుళ్ళు రంగంలోకి దిగారని, వారు అందులో దిట్ట అన్నారు. దళితబంధు విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీలు తోడు దొంగలేనని, ఇప్పుడే డబ్బులు తీసుకుంటే కాంగ్రెస్‌కి ఓటు వేస్తారని భయం పట్టుకుందని, చివ‌ర్లో డ‌బ్బులు పంచుతార‌న్నారు. దళితబంధు పథకాన్ని ఎన్నికలకు ముందే అమలు చేశారని, పాత పథకం అయితే ఆపితే ఎలా ఊరుకున్నార‌ని, అసెంబ్లీలో వర్గీకరణపై నిలదీస్తే అసెంబ్లీ నుంచి గతంలో తనను బయటకు నెట్టారంటూ గ‌తంలో జ‌రిగిన విష‌యాన్ని రేవంత్ గుర్తుచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ గెలుపు త‌థ్య‌మ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: