ఏపీలో తెలుగుదేశం పార్టీ నేత‌ల‌పై, ఆ పార్టీ కార్యాల‌యాల‌పై దాడులు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కానీ ఇదంతా అవాస్త‌వ‌మ‌ని వైసీపీ నేత‌లు కొట్టేస్తున్నారు. హోంమంత్రి సుచ‌రిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ఆ పార్టీ నేత‌లే దాడులు చేయించుకున్నార‌ని, గుర్తు తెలియ‌ని నెంబ‌రు నుంచి డీజీపీకి ఫోన్ చేశార‌న్నారు. ఎవ‌రికి వారే ఏం చెబుతున్నారో అర్థం కాని ప‌రిస్థితి రాష్ట్రంలో నెల‌కొంది. బాధ్య‌త క‌లిగిన ప్ర‌జాప్ర‌తినిధులు ప‌చ్చి అబ్దాలు మాట్లాడుతుండ‌టంపై ప్ర‌జ‌లు విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీవారు చెప్పేది న‌మ్మాలా?  లేదంటే వైసీపీ వారు చెప్పేది న‌మ్మాలో అర్థంకాని అయోమ‌య స్థితిలో ఉన్నారు. దీనంత‌టికీ కార‌ణం ఏమిటంటే.. ఎవ‌రికీ ప్ర‌జ‌ల‌పై, వారి అభివృద్ధిపై బాధ్య‌త లేక‌పోవ‌డ‌మే. ఏపీలో ఏం జ‌రుగుతోంది అని ఇత‌ర రాష్ట్రాల‌తోపాటు కేంద్రం కూడా ఆరా తీసే ప‌రిస్థితి ఉంది అంటే శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిస్థితికానీ, ఇక్క‌డి సామాజిక ప‌రిస్థితులు కానీ ఎలావున్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. అభివృద్ధిలో ముందుండాల్సిన ఏపీ రోజురోజుకీ దిగ‌జారి అట్ట‌డుగు స్థానానికి చేరుకుంటుడంపై ప్ర‌జ‌లు కూడా ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap