క‌రోనా దేశంలో అదుపులోనే ఉన్న‌ట్లు క‌న‌పడుతోందికానీ కేసులు నెమ్మ‌ది నెమ్మ‌దిగా పెరుగుతున్నాయి. మొన్న 13వేల‌గా ఉన్న కేసులు నిన్న 14వేలు అయ్యాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా పెరిగింది. 197 మంది ఈ క‌రోనా బారిన‌ప‌డి గ‌డిచిన 24 గంట‌ల్లోగా మృత్యువాత ప‌డ్డారు. దేశ‌వ్యాప్తంగా డోసుల సంఖ్య 100 కోట్ల‌కు చేర్చాల‌నే ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ఉంది. అందుకు త‌గ్గ‌ట్లుగా ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అయితే చాలా రాష్ట్రాల్లో క‌రోనా టీకా కేంద్రాలు చాలావ‌ర‌కు మూత‌ప‌డ్డాయి. ప్ర‌జ‌లు కూడా ఒక డోసు వేయించుకున్న‌వారు రెండోడోసు వేయించుకోవ‌డానికి ముందుకు రావ‌డంలేద‌ని, క‌చ్చితంగా అంద‌రూ రెండు డోసులు వేయించుకోవాల‌ని కొవిడ్ టాస్క్ ఫోర్స్ అధిప‌తి వీకేపాల్ సూచిస్తున్నారు. రెండు డోసులు వేయించుకున్న త‌ర్వాత బూస్ట‌ర్ డోస్ అవ‌స‌ర‌మా?  కాదా? అన్న‌ది ప్ర‌భుత్వం నిర్ణ‌యిస్తుంద‌న్నారు. దీనిపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని, అమెరికాతోపాటు యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు మాత్రం త‌మ‌పౌరుల‌కు బూస్ట‌ర్ డోస్ ఇస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: