దశర పర్వదినాన్ని దేశప్రజలతో పాటు తెలుగు ప్రజలు కూడా సంబరంగా జరుపుకున్నాం. ఇంకొన్ని రోజుల్లో దీపావళి పండుగ రాబోతుంది. దీపావళి పండుగ గురించి అందరిలో అనేక అభిప్రాయాలూ ఉన్నాయ్. తాజాగా సినీ నటుడు మరియు నిర్మాత బండ్లగణేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దశరా తరువాత దీపావళి పండుగ రావటానికి గల కారణాలను బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. బండ్ల గణేష్  ట్విట్టర్ ఖాతాలో పండుగ గురించి ట్వీట్ చేశారు  " ప్రతి సంవత్సరం దసరా తర్వాత సరిగ్గా 21 డేస్  తర్వాత దీపావళి ఎందుకు వస్తుంది? మీరు నమ్మకపోతే, క్యాలెండర్‌ను తనిఖీ చేయండి. రామచంద్రుడి సైన్యం శ్రీలంక నుండి కాలినడకన అయోధ్య చేరుకోవడానికి 21 రోజులు (504 గంటలు) పట్టిందని వాల్మీకి మహర్షి రామాయణము లో చెప్పారు "






 అంటూ ట్వీట్ చేసారు. దీనిపై పలువురు అర్చక పండితులు కూడా స్పందించి బండ్లగణేష్ కళ్ళు తెరిపిస్తున్నారు శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానం అర్చకుడైనటువంటి అగ్రహారం రాఘవేంద్ర స్పందిస్తూ ఇలా ట్వీట్ చేశారు " ఇది అపద్దం. లంకనుండి పుష్పక విమానం లో వచ్చారు రాములవారు. ఇంకొవిషయం దసరాకు రావణవధకు సంబంధంలేదు.వాల్మీకి అటువంటిది ఏమి వ్రాయలేదు. " అంటూ చెప్పారు. అయితే బండ్లగణేష్ మాత్రం ఈ ట్రోల్స్ పై స్పందించలేదు.




మరింత సమాచారం తెలుసుకోండి: