ఆంధ్ర‌ప్ర‌దేశ్ టీడీపీ నేత‌ల‌పై మంగ‌ళ‌గిరి పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది.  టీడీపీ కార్యాల‌యం దగ్గ‌ర సీఐ శంక‌ర్ నాయ‌క్ పై దాడి చేశార‌ని అభియోగాలు న‌మోద‌య్యాయి. ఈ వివ‌రాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీజీపీ బుధ‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో వెల్ల‌డించారు. సీఐ శంక‌ర్‌పై దాడి చేశార‌ని కేసు న‌మోదు చేశాం. ఏ1 గా లోకేశ్‌, ఏ2 అశోక్‌బాబు, ఏ3 ఆల‌పాలి రాజా, ఏ4 తెనాలి శ్ర‌వ‌ణ్ ల‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు డీజీపీ గౌత‌మ్ శవంగ్ వెల్ల‌డించారు.

అదేవిధంగా పోలీసుల‌ను ఆయ‌న కొనియాడారు. పోలీసుల సేవ‌లు అంతా ఇంతా కాదు. క‌రోనా స‌మ‌యంలో వారి సేవ‌లు, త్యాగాలు మ‌ర‌వ‌లేనివ‌ని పేర్కొన్నారు. క‌రోనా కాటుకు ఎంతో మంది పోలీసులు మృత్యువాత‌ప‌డ్డారు. వారందరికీ అక్టోబ‌ర్ 21 న పోలీస్ సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా నివాళుల‌ర్పిస్తాం. అదేవిధంగా టీడీపీ కార్యాలయాల‌పై దాడి చేసిన వారిపై 70 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు న‌మోదు చేసిన‌ట్టు డీజీపీ వెల్ల‌డించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: