ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిన్న ప‌ట్టాబి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణానికి దారి తీశాయి.  ఇరు పార్టీల నేతల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతుంది. తాజాగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తాడేప‌ల్లిలో విలేక‌ర్ల స‌మావేశం నిర్వ‌హించారు.  టీడీపీ నేత‌లు నిస్పృహ‌లో మునిగిపోయారు. వ‌క్రీక‌ర‌ణ‌ల‌తో ల‌బ్ధిపొందాల‌ని చూస్తున్నారు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతున్నారు. రెచ్చ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నా.. మేము సంమ‌య‌నం పాటిస్తున్నాం. ప‌ట్టాబి మాట‌ల వెనుక క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ అన్ని చంద్ర‌బాబే ఉన్నాడు. చంద్ర‌బాబుకు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాలు తెలియ‌వు. ప‌ట్టాబి రాయ‌లేని విధంగా ఇష్టం వ‌చ్చిన‌ట్టు బూతులు తిట్టాడు. ఒకే ప‌దాన్ని ప‌దే ప‌దే ప్ర‌స్తావించారు. మీరు మాట్లాడ‌డం వ‌ల్ల‌నే రియాక్ష‌న్ వ‌చ్చింది క‌దా.. మాట్లాడ‌కుంటే రియాక్ష‌న్ ఉండేదా..? ఒక‌సారి ఆలోచించండి. దీనిపై చంద్ర‌బాబు స్పందించి ప‌ట్టాబి మాట‌లు త‌ప్పు అని ఒక మాట అని ఉంటే ఇలాంటి వాతావ‌ర‌ణం ఉండేది కాదు.

ప‌ట్టాబి నోరు జారి మాట్లాడిన మాట‌లు కావు ఇవి. ప్రీ ప్లాన్డ్‌గానే కావాల‌నే మాట్లాడారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను దుర్భాష‌లాడారు. నోరు తెరిస్తే బూతులే మాట్లాడుతున్నారు. సీఎం జ‌గ‌న్‌పై నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడారు. టీడీపీ నాయ‌కుల‌ను ఇవే మాట‌లు మాట్లాడితే వాళ్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుంది అని ప్ర‌శ్నించారు. కార్య‌క‌ర్త‌లు, అభిమ‌మానులు ఆవేశంతో నిర‌స‌న‌లు చేప‌ట్టారు. సీఎం జ‌గ‌న్ దీనిపై ఏమి రియాక్ష‌న్ కాలేదు.  చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు మేము ఎప్పుడైనా బూతులు తిట్టామా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్ర‌బాబుకు రాష్ట్రప‌తి పాల‌న పెట్టాల‌నే ఆతృత ఏమిట‌ని ప్ర‌శ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: