క‌రోనా ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రోసారి విరుచుకుప‌డ‌నుందా అనే అనుమానాల‌ను వైద్య‌నిపుణులు వ్య‌క్తం చేస్తున్నారు. అమెరికా, ర‌ష్యా, ఆస్ట్రేలియా, బ్రిట‌న్‌, ఇట‌లీ త‌దిత‌ర దేశాల‌న్నింటిలో కేసుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది. అమెరికా, బ్రిట‌న్ కేసుల సంఖ్య‌ను చూసి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. ఆంక్ష‌ల‌ను స‌డ‌లించ‌డంవ‌ల్లే బ్రిట‌న్‌లో, ఆంక్ష‌లు లేక‌పోవ‌డంవ‌ల్ల అమెరికా, ర‌ష్యా, ఆస్ట్రేలియాలో కేసులు పెరుగుతున్నాయ‌ని సంస్థ చెబుతోంది. అమెరికాలో త‌మ పౌరుల‌కు బూస్ట‌ర్ డోస్ అందించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆస్ట్రేలియాలో కాన్‌బెర్రా, సిడ్నీ, మెల్‌బోర్న్ లాంటి న‌గ‌రాల్లో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమిగూడే చోట కేసులు పెరుగుతున్నాయి. డెల్టార‌కంలో ఉత్ప‌రివ‌ర్త‌నం చెందిన ఏవై 4.2 ర‌కంవ‌ల్లే కేసులు పెరుగుతున్నాయ‌ని వైద్య‌నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. ర‌ష్యాలో ఈనెల 23వ తేదీ నుంచి ఆంక్ష‌లు విధించ‌నున్నారు. అమెరికాలో ప్ర‌తిరోజు 90వేల కేసులు న‌మోదవుతున్నాయి. రోగుల సేవ‌ల కోసం ఆర్మీకి చెందిన వైద్యులు, న‌ర్సుల‌ను కూడా ఆ దేశం రంగంలోకి దింపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: