క‌రోనా టీకా డోసుల పంపిణీలో భార‌త్ కొత్త రికార్డును న‌మోదు చేసింది. 100 కోట్ల డోసులు పంపిణీ చేసి చ‌రిత్ర సృష్టించింది. దీనిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ స్పందించారు. న‌వ‌చ‌రిత్ర‌ను సృష్టించామ‌న్నారు. భార‌త సైన్స్, ఎంట‌ర్‌ప్రైజెస్ విజ‌యాన్ని మ‌నంద‌రం ఆస్వాదిస్తున్నామ‌ని, వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర ఆరోగ్య రంగంలోని సిబ్బంది అంద‌రికీ ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు. ప్ర‌జ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. సైన్స్ ను, శాస్త్ర‌వేత్త‌ల‌ను, టీకా పంపిణీని కూడా వ్యాపారంతో ముడిపెట్టి ఎంట‌ర్ ప్రైజెస్ అని మాట్లాడ‌టంద్వారా వ్యాపార‌వేత్త‌ల‌కు సాయం చేసే గుణాన్ని ప్ర‌ధాన‌మంత్రి మ‌రోసారి బ‌హిరంగంగా చాటుకున్నారంటూ ప్ర‌తిప‌క్ష నేత‌లు మండిప‌డుతున్నారు. క‌రోనా స‌మ‌యంలో గుజ‌రాత్ నుంచి వ‌చ్చిన వ్యాపారి ట‌ర్నోవ‌ర్‌కానీ, కంపెనీలు కానీ ఒక్క‌సారిగా ఎలా పెరిగాయ‌ని అదానీ గ్రూప్ ను ఉద్దేశించి ప్రశ్నించారు. న‌వ‌చ‌రిత్ర సృష్టించామ‌ని ప్ర‌ధాన‌మంత్రి మాట్లాడ‌టం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని, ఎందులో న‌వ‌చ‌రిత్ర సృష్టించార‌ని, రెండోద‌శ‌లో చేతులెత్తేయ‌డంద్వారా న‌వ‌చ‌రిత్ర సృష్టించారా? అంటూ మండిప‌డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: