టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభిరామ్‌కు విజ‌య‌వాడ సివిల్ కోర్టు 14 రోజులు క‌స్ట‌డి విధించింది. న‌వంబ‌ర్ 02 వ‌ర‌కు న్యాయ‌స్థానం రిమాండ్ విధించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని.. రెచ్చ‌గొట్టేలా ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగేలా వాతావ‌ర‌ణం సృష్టించార‌ని ప‌లు సెక్ష‌న్‌ల కింద ఆయ‌న‌ను అరెస్టు చేశారు. గురువారం విజ‌య‌వాడ‌లోని మూడ‌వ మెట్రోపాలిట‌న్ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. ఇదిలా ఉండ‌గానే మ‌రోవైపు త‌న‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని ప‌ట్టాభి బెయిల్ పిటీష‌న్ దాఖ‌లు చేశారు.

గురువారం  విజ‌య‌వాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ప‌ట్టాభికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అనంత‌రం కోర్టులో హాజ‌రు ప‌రిచారు. త‌న‌ను అరెస్టు చేసిన విధానంపై న్యాయ‌స్థానానికి విన్న‌వించారు. తలుపులు బ‌ద్ద‌లు కొట్టి అరెస్ట్ చేశార‌ని, రాత్రి స‌మ‌యంలో అరెస్టు చేశారు. నేను వ్య‌క్తి గ‌తంగా ఎవ‌రిని ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. కుట్ర‌పూరితంగా అస‌లు చేయ‌లేద‌ని ప‌ట్టాభి న్యాయ‌స్థానంలో ముందు చెప్పాడు. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను మాత్ర‌మే చాటి చెప్పాన‌ని.. ఎలాంటి కుట్ర పూరితంగా వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని వివ‌రించారు. ఘ‌ర్ష‌ణ‌ల‌కు కార‌ణం తాను వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ని తెలిపారు. ఇరువురి వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం 14 రోజుల పాటు క‌స్ట‌డి విధించిన‌ట్టు తీర్పును వెలువ‌రించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: