తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని ప్రారంభించిన ప‌థ‌కాల‌లో ద‌ళిత‌బంధు ఒక‌టి. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయ‌ని ఇటీవ‌ల‌ కేంద్ర ఎన్నిక‌ల సంఘం అక్క‌డ ద‌ళిత‌బంధును నిలిపివేసిన విష‌యం విధిత‌మే. తాజాగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని నిలుపుద‌ల‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో ఓ పిల్ దాఖ‌లైంది.

సామాజికవేత్త మ‌ల్లేపల్లి ల‌క్ష్మ‌య్య కోర్టులో ఫిల్ వేశారు. ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు అన్ని అమ‌లు అవుతున్న స‌మ‌యంలో కేవ‌లం ద‌ళిత బంధునే ఎందుకు ఆపాల‌ని ఎన్నిక‌ల సంఘం ఆదేశించింద‌ని పేర్కొన్నారు. ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని య‌ధావిధిగా కొన‌సాగించాల‌ని పిటీష‌న‌ర్ పేర్కొన్నారు. ద‌ళిత‌బంధు ర‌ద్దు పై ఇటీవ‌ల పెద్ద చ‌ర్చ‌నే జ‌రిగింది. బీజేపీ నేత‌లు, టీఆర్ఎస్ నేత‌లు ఒక‌రిపై మ‌రొక‌రు దూషించుకున్నారు. హుజూరాబాద్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఇప్ప‌టికీ నిత్యం ఏదో ఒక సంద‌ర్భంలో ద‌ళిత‌బంధు చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. బండిసంజ‌య్‌, ఈట‌ల ఒక‌వైపు నుంచి.. మ‌రోవైపు నుంచి హ‌రీశ్‌రావు.. బాల్క‌సుమ‌న్‌, మంత్రులు కొప్పుల త‌దిత‌రులు మాట‌ల యుద్ధాన్ని కొన‌సాగిస్తున్నారు. దీనిపై కోర్టు ఏమి తీర్పు ఇస్తుంద‌నేది వేచి చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: