వాట్సాప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వున్న కోట్లాదిమంది జనాలు కామన్ గా వినియోగిస్తున్న ఏకైక యాప్. వాట్సాప్.ఇక ఈ యాప్ ఫేస్ బుక్ కి గట్టి పోటీ ఇవ్వడంతో ఫేస్ బుక్ ఈ యాప్ ని కొనుగోలు చెయ్యడం జరిగింది. ఇక ఫేస్‌బుక్ కంపెనీ యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ అయినా వాట్సాప్ నవంబర్ 1 నుంచి అంటే 10 రోజుల్లో అనేక స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం ఆపేయనున్నట్లు ప్రకటించింది. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ రెండింటి పాత వెర్షన్‌లలో ఈ యాప్ సపోర్ట్ చెయ్యదని వాట్సాప్ తన ప్రకటనలో తెలిపడం అనేది జరిగింది.

ఇక ఆండ్రాయిడ్ OS 4.1 ఇంకా పైన అలాగే iOS 10 మరియు అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా మాత్రమే మెసేజింగ్ యాప్‌ని ఉపయోగించగలరు. ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులందరూ మొబైల్ ఫోన్ సెట్టింగ్‌లను యాక్సెస్ చేయడం ద్వారా వాడుతున్న సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ని కూడా చెక్ చేయవచ్చు.కాబట్టి వినియోగదారులు వాట్సాప్ వినియోగాన్ని కొనసాగించాలనుకుంటే కొత్త అప్డేటెడ్ వర్షన్ కలిగిన ఫోన్లని కొనాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: